BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

​విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 04:37 PM
58 వీక్షణలు

నాణ్యమైన విద్య అందించేందుకే మౌలిక వసతుల కల్పన: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తాండూరులో రూ. 1.95 కోట్ల అంచనా వ్యయంతో మహాత్మ జ్యోతిబా పూలే వసతి గృహానికి శంకుస్థాపన

​బెల్లంపల్లిలో అదనపు తరగతి గదుల ప్రారంభం

​కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మూత్రశాలలు తదితర పూర్తి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

​ఈ క్రమంలో శుక్రవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలో విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే వసతి గృహ నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. రూ. 1 కోటి 95 లక్షల ఎస్.డి.ఎఫ్ (SDF) నిధుల అంచనా వ్యయంతో ఈ వసతి గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల తహసిల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీనివాస్, మహాత్మ జ్యోతిబా పూలే ఆర్.సి.ఓ బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

​అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మనోజ్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 లక్షల 50 వేల సమగ్ర శిక్షా అంచనా నిధులతో ఈ పాఠశాల అదనపు తరగతి గదులను నిర్మించడం జరిగిందని తెలిపారు. గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరిగిందని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల విద్యాధికారితో పాటు ఇతర సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు