BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 12 June 2026, 03:37 pm
Posted by : V శ్రీనివాస్

సారంగపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 03:37 PM
282 వీక్షణలు

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని పురుషుడి అస్థిపంజరం లభ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సారంగపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి కేశవగేని బాలయ్య శుక్రవారం ఉదయం మేకలను మేపేందుకు అడవిలోకి వెళ్లగా, పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిన మృతదేహాన్ని గుర్తించాడు. మృతదేహం సమీపంలో లేత నీలం రంగు ప్యాంటు, బెల్టు కనిపించినట్లు సమాచారం. అడవి జంతువులు మృతదేహాన్ని తినివేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

వెంటనే బాలయ్య ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలి రాములుకు తెలియజేయగా, సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ తల భాగం, చేతులు, కాళ్ల ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం పంచాయతీ కార్యదర్శి పుప్పాల సవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మృతికి గల కారణాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న క్లూస్ టీమ్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అడవిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.