BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 05:50 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
18 Apr, 2026 - 05:50 PM
152 వీక్షణలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం

42వ డివిజన్‌లో జరిగిన  18వ ప్రజాదర్బార్

ప్రజల వినతులు స్వీకరించిన రాష్ట్ర అధికార 

ప్రతినిధులు డూండి రాకేష్, ఎం.ఎస్. బేగ్

సమస్యల పరిష్కారానికి అధికారులకు స్పాట్ ఆర్డర్స్

విజయవాడ (పశ్చిమ), ఏప్రిల్ 18:

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం 42వ డివిజన్ పరిధిలో నిర్వహించిన 18వ ప్రజాదర్బార్కు బాధితులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎంపీ చిన్ని  ప్రాతినిధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే!

ఈ ప్రజాదర్బార్‌లో ప్రధానంగా నివేశన స్థలాలు, రేషన్ కార్డులు, సామాజిక పింఛన్లు, డ్రైనేజీ సమస్యలు మరియు వీధి దీపాలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలను అందజేశారు. వినతులు స్వీకరించిన అనంతరం అతిథులు అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. 

ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సకాలంలో పరిష్కారం చూపాలంటూ గట్టిగా ఆదేశించారు.

ప్రజల మనిషి - కేశినేని చిన్ని:

ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ.. "ఎంపీ కేశినేని చిన్ని  అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి తోడు, సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ 18 ప్రజాదర్బార్‌లను నిర్వహించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం" అని పేర్కొన్నారు.

అనంతరం ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ.. "విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా ఈ వేదికను తీర్చిదిద్దారు" అని కొనియాడారు.

ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు తమ గోడు వినేవారు దొరికారని సంతోషం వ్యక్తం చేస్తూ, ఎంపీ చిన్ని కి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  టీడీపీ sc సీనియర్  నాయకులు కామ దేవరాజ్, క్లస్టర్ వై రామయ్య ,బీసీ సెల్ ప్రెసిడెంట్ శివాజీ ముదిరాజ్, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పితాని పద్మ , మైనారిటీ సెల్ వైస్  ప్రెసిడెంట్ సయ్యిద్ అలీ,ఐటీడీపీ చైతన్య,  42 డివిజన్  ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరావు,ప్రధాన కార్యదర్శి పచ్చవా మల్లికార్జున,డివిజన్ కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.