BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

విజయవాడలో ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్ స్పష్టత.. నోటీసులు వస్తే భయపడొద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:32 PM
20 వీక్షణలు

విజయవాడలో ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్ స్పష్టత.. నోటీసులు వస్తే భయపడొద్దు

ఓటు హక్కు తొలగింపు కాదు.. ఆధారాలతో అభ్యంతరాలు తెలపొచ్చు

దోషరహిత ఓటర్ల జాబితా తయారీలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, ఆగస్టు 22:

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నోటీసు అందుకోవడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని స్పష్టం చేశారు.

కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నోటీసుకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ వద్ద ఉన్న ఆధారాలు, సంబంధిత పత్రాలను సమర్పించి అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.

ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఓటర్ల జాబితాను కచ్చితత్వంతో, దోషరహితంగా రూపొందించడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇప్పటివరకు జిల్లాలో 1,85,718 నోటీసులు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో 32,996 మందికి విచారణ పూర్తయిందని, మరో 69,717 మందికి విచారణ గడువు ముగియడంతో రీషెడ్యూల్ చేయాల్సి ఉందని తెలిపారు.

ఆగస్టు 22, 23, 29, 30 తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6, అభ్యంతరాలు, మార్పుల కోసం ఫారం-7, ఫారం-8లు బీఎల్‌వోల వద్ద అందుబాటులో ఉంటాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం, తెదేపా ప్రతినిధి వై. రామయ్య, భాజపా ప్రతినిధి పి. గోవింద, ఆప్ ప్రతినిధి టి. హరికృష్ణ, కాంగ్రెస్ ప్రతినిధి బి. మురళీకృష్ణ, సీపీఎం ప్రతినిధి డీవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.