BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 05:51 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో నేహా బోరా సదస్సును విజయవంతం చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 05:51 AM
123 వీక్షణలు

విజయవాడలో నేహా బోరా సదస్సును విజయవంతం చేయాలి

విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా), రివల్యూషనరీ యూత్ అసోసియేషన్ (ఆర్‌వైఏ) సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడారు.

విద్యార్థి ఉద్యమ నేత, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా ఈ నెల 18న విజయవాడకు రానున్న సందర్భంగా హనుమంతరాయ గ్రంథాలయంలో ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జేఎన్‌యూ విద్యార్థుల ఉద్యమంలో 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం చేసిన నేహా బోరా సదస్సులో పాల్గొంటారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని హరినాథ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆర్‌వైఏ, ఐసా ఆధ్వర్యంలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఆర్‌వైఏ రాష్ట్ర కార్యదర్శి అనిల్, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగార్జునతో పాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.