BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 07 August 2026, 05:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట మండలంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
40 వీక్షణలు

ఎల్నినో ప్రభావ నివారణకు రైతులకు సూచనలు

విస్సన్నపేట: ఎల్నినో ప్రభావంతో పంటలకు ఎదురయ్యే నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని విస్సన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లదేవరపల్లి, చండ్రుపట్ల గ్రామాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, రైతు సేవా సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతు క్షేత్రాలను సందర్శించారు. పంటల ప్రస్తుత పరిస్థితి, నీటి లభ్యత, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు తగిన సూచనలు అందించారు.

పంటల పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు రైతులకు వివరించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. పంట బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.