BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట వెలుగు కార్యాలయంలో అక్రమాలపై వైసీపీ నేతల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
115 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలంలోని వెలుగు కార్యాలయం పరిధిలో శ్రీనిధి, డ్వాక్రా రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వైసీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, కొత్త సభ్యురాలిని డ్వాక్రా గ్రూపులో చేర్చేందుకు రూ.500, శ్రీనిధి రుణం మంజూరు చేయడానికి కార్యాలయ ఖర్చుల పేరుతో రూ.3,000 నుంచి రూ.4,000 వరకు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వని పక్షంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదని పలువురు డ్వాక్రా మహిళలు తమకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

పేద మహిళల అభివృద్ధి కోసం ఉద్దేశించిన డ్వాక్రా గ్రూపుల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడం బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అనంతరం జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్ధిదారుల పూర్తి జాబితాను అందించాలని మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.