BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 August 2026, 03:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట: విద్యార్థుల గొంతుకను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 03:09 PM
161 వీక్షణలు

విస్సన్నపేట: విద్యార్థుల గొంతుకను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలను ప్రశ్నిస్తూ జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తి ఆరేళ్ల బాలుడి నుంచి జన జీ వరకు విస్తరించిందని ఆయన అన్నారు. నేహ బోరా వారసులుగా అనేక మంది యువత, విద్యార్థులు ఉద్యమ స్ఫూర్తితో పాలకులను ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారని పేర్కొన్నారు.

బీహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో చర్చలకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని హరినాథ్ అన్నారు.

విద్యార్థుల ర్యాలీలో తన తల్లితో కలిసి పాల్గొన్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆదిత్య కుమార్ కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపాలని డిమాండ్ చేశాడని తెలిపారు. విద్యార్థుల సమస్యలను వినేందుకు సిద్ధంగా లేని బీహార్ ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేయడం ద్వారా ఎన్డీఏ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని హరినాథ్ ఆరోపించారు. ఇది పాలకుల బుల్డోజర్ విధానానికి నిదర్శనమని అన్నారు.

విద్యార్థులపై అణచివేత చర్యలను ప్రజాస్వామికవాదులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.