BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 04 August 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ఎల్నినోపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణపై శాస్త్రవేత్తల కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 07:17 PM
165 వీక్షణలు

విస్సన్నపేటలో ఎల్నినోపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణపై శాస్త్రవేత్తల కీలక సూచనలు

విస్సన్నపేట, ఆగస్టు 4:

ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం విస్సన్నపేట మండలంలోని తెల్లదేవరపల్లి, చండ్రుపట్ల, విస్సన్నపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్నినోపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లామ్ వ్యవసాయ శాస్త్రవేత్త టి. శ్రీనివాస్, గరికపాడు వ్యవసాయ పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన డా. యూ. విజయ భాస్కర్ రెడ్డి, డా. టి. జస్వంత్ రెడ్డి పాల్గొని ఎల్నినో ప్రభావం వల్ల ఎదురయ్యే పరిస్థితులు, వివిధ పంటల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తక్కువ వర్షపాతం సమయంలో అనుసరించాల్సిన సాగు విధానాలపై రైతులకు వివరించారు.

అనంతరం శాస్త్రవేత్తల బృందం పొలాలను సందర్శించి విత్తన గుళికల వినియోగం, అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు చర్యలు, వరి పంటలో కలుపు నివారణ వంటి అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. విత్తన గుళికల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కె. శశికళ, వ్యవసాయ అధికారి జి. రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.