BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 11:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 11:03 PM
187 వీక్షణలు

విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల లంబాడీ తండాకు చెందిన వడిత్య రాజేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజేష్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, రాజేష్ పని నిమిత్తం విజయవాడ సమీపంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఫోటోలు పంపాడు. ఆ తర్వాత అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అనుమానం కలిగింది.

మరుసటి రోజు ఉదయం 8:30 గంటల సమయంలో చండ్రుపట్ల మెయిన్ రోడ్ వద్ద ఎన్ఎస్పి కాలువ బ్రిడ్జి సమీపంలో, అతని బైక్‌తో పాటు కాలువలో అనుమానాస్పద స్థితిలో శవం కనిపించింది. శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విస్సన్నపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవపంచనామా, ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్య అని నిర్ధారించారు.

దర్యాప్తులో భాగంగా, మృతుడి భార్య వడిత్య అలేఖ్యకు చిలక కృష్ణసేనతో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. రాజేష్‌ను తొలగించేందుకు రూ.3 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

క్రికెట్ గ్రౌండ్‌లో మద్యం తాగించిన తర్వాత, మత్తులో ఉన్న సమయంలో దిండు తో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు, అనంతరం శరీరంపై దాడి చేసి కారులో నూజివీడు నుంచి విస్సన్నపేటకు తీసుకువచ్చి కాలువలో పడవేసినట్లు వెల్లడైంది.

హత్యను రోడ్డు ప్రమాదంగా మలచేందుకు ప్రయత్నించినా, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజం బయటపడింది.

ఈ కేసులో నిందితులను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. గిరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ రాజు తమ సిబ్బందితో కలిసి పుట్రేల–మల్లెల గ్రామాల మధ్య ఎన్ఎస్పి కాలువ బ్రిడ్జి వద్ద సాయంత్రం 5:30 గంటలకు అరెస్ట్ చేశారు.

పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.