BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:35 PM
110 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేటలో మేడే సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ (HMC) వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. “అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే” అనే సందేశంతో కార్మికులు ఐక్యంగా పాల్గొని సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.

బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఐక్యత, సమానత్వం, హక్కుల సాధన నినాదాలతో ప్రాంతం అంతా సందడి నెలకొంది.

మేకల జ్ఞాన రత్నం మాట్లాడుతూ, భారతదేశంలోనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి ఒకే యూనియన్‌గా ఏర్పడటం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ఐక్యతను అభినందించారు.

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు షేక్ బుడే మాట్లాడుతూ, ఇప్పటికీ తమకు స్థిరమైన పనిస్థలం లేక రోడ్లపైనే పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితుల్లో మార్పు లేదని తెలిపారు. విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆటోనగర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల హక్కులు పూర్తిగా అమలు కావాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు, సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, HMC యూనియన్ అధ్యక్షుడు నూరుద్దీన్, కార్యదర్శి షేక్ హుస్సేన్, సహాయ కార్యదర్శి సిరాజ్ బాబు, వైస్ ప్రెసిడెంట్ రాఘవ, షేక్ బుడే తదితరులు పాల్గొన్నారు.