BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 August 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో టీడీపీ సర్వసభ్య సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 06:03 AM
82 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాయల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం, మండలంలోని ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

డీఎస్సీ ఎంపిక అంశంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సమావేశంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జిలు నెక్కళపు శ్రీనివాసరావు (డాబాశ్రీను), కవులూరి రాజా, పీఏసీఎస్ అధ్యక్షులు వీరమాచినేని కృష్ణప్రసాద్, కభంపాటి బద్రీనాథ్, ఆర్బీఎస్ జాతీయ అధ్యక్షులు గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బుడ్డయ్య), మండల పార్టీ మాజీ అధ్యక్షులు మట్టా వేణుగోపాలరావు, జిల్లా పార్టీ కోశాధికారి నాదెళ్ల నాగమణి, ఏఎంసీ డైరెక్టర్ పల్లెపాం రాంబాబు, పట్టణ అధ్యక్షులు కొంగల శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.