BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 22 August 2026, 03:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉపసంహరణ....

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:24 PM
64 వీక్షణలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉపసంహరణ.. కేంద్రం కీలక నిర్ణయం

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

మూడు నెలల గడువులోగా సీఐఎస్ఎఫ్ యూనిట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. నవంబర్ 17 నాటికి మొత్తం సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గతంలో స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహించేవారు. 2024 తర్వాత దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం ప్లాంట్‌లో 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

తాజా ఆదేశాలతో వీరిని కూడా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించినట్లు సమాచారం. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై అయోమయం నెలకొంది. భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయన్న అంశంపై చర్చ జరుగుతోంది.