BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 29 June 2026, 03:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 03:48 PM
175 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి (84) సోమవారం ఉదయం కన్నుమూశారు.

గత కొంతకాలంగా హైదరాబాద్‌లో తన కుమారుడు చక్రపాణి వద్ద ఉంటున్న రంగారెడ్డి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య కొంతకాలం క్రితమే మరణించారు.

యన్నం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పలు హైస్కూల్‌లలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారిగా కూడా పనిచేశారు. విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ, అంకితభావంతో ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేసి ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు.

ఆయన మృతిపట్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కెర వెంకటప్ప రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, స్థానిక సాయిబాబా కమిటీ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యన్నం రంగారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.