BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 07:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వ్యసన రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 07:33 PM
57 వీక్షణలు

వ్యసన రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

తిరువూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన "నశా ముక్త్ భారత్ అభియాన్" (వ్యసన రహిత భారత్) కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా వ్యసనాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి "నశా ముక్త్ భారత్ అభియాన్" ప్రతిజ్ఞ చేయించి, ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

వ్యసన రహిత భారత ప్రతిజ్ఞను ఆన్‌లైన్‌లో చేయడానికి రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని ప్రజలకు సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం, మనశ్శాంతిని పెంపొందించుకోవడం, సమాజానికి సేవ చేయడం, జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆధ్యాత్మిక విలువలను అలవరుచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

"నశా రహిత భారత్ – ఆరోగ్యకర భారత్ – ఆనందమయ భారత్" నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.