BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 07:42 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

వర్షంలోనూ కొనసాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
23 Sep, 2026 - 07:42 PM
153 వీక్షణలు

లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో వేపాల్ భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది.

వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా మహిళలు భక్తిగీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తులు వినాయకుడి నామస్మరణతో ముందుకు సాగారు.

శోభాయాత్ర కొంత దూరం వెళ్లిన అనంతరం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా శోభాయాత్రను కొనసాగించారు. మహిళలు నృత్యాలు చేస్తూ, భక్తులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

“గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా” అంటూ భక్తులు చేసిన నినాదాలతో వెంకట్రావుపేట వీధులు మార్మోగాయి. వర్షం మధ్య కొనసాగిన నిమజ్జన శోభాయాత్ర స్థానికులను ఆకట్టుకుంది.