స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
మార్కాపురం జిల్లా, వెలిగండ్ల:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం వెలిగండ్లలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో సన్నద్ధం కావాలని అన్నారు.
టీడీపీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, వెలిగండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు ఇంద్రభూపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.