BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 05 August 2025, 08:42 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ద్వారా మండల భూముల సమస్యలకు మోక్షం కలిగేనా?

తెలంగాణ
05 Aug, 2025 - 08:42 PM
462 వీక్షణలు
భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ద్వారా మండల భూముల సమస్యలకు మోక్షం కలిగేనా?-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS : బొమ్మలరామారం. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న భూములకు భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ద్వారా రైతుల సమస్యలకు ఇప్పటికైనా మోక్షం కలుగుతుందా అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. మంగళవారం రోజున ఎన్ టుడే న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ప్రకారం మండలంలోని ఉన్న గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో పట్టా, ప్రభుత్వ, లావణి పట్టా, ఇనాం భూములపై వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ జరపడం లేదని అన్నారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మండలంలో భూ సమస్యలు పేరుకుపోయి పరిష్కారానికి నోచుకోలేక పోతున్న పరిస్థితి ఉన్నది అని అన్నారు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసుకున్న రైతులు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురావడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు అని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని తొలగించి అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలు చేసే విధంగా భూభారతి చట్టం తీసుకొస్తే బొమ్మలరామారం మండలంలోని రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని అన్నారు రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాస్ బుక్కులు కబ్జాలో ఉన్న భూములను సర్వే చేసి రైతుల పేరున నమోదు చేయాలని అన్నారు చెయ్యని పక్షాన సిపిఎం పార్టీ తరపున బాధిత రైతులను సమీకరించి పెద్ద ఎత్తున తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. Follow us on Website Facebook Instagram YouTube