జర్నలిస్టులకు ఏఐ, సోషల్ మీడియాపై వర్క్‌షాప్
తెలంగాణ
/
నల్గొండ
NTODAY NEWS నల్గొండ,
నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అక్టోబర్పి 3న నల్గొండ డివిజన్ పరిధిలోని జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సోషల్ మీడియాపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. వర్క్‌షాప్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా రంగాల్లో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్లు హాజరై జర్నలిస్టులకు అవగాహన కల్పించనున్నారు. ఉదయం ఏఐపై, సాయంత్రం సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ డివిజన్ పరిధిలోని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు.