సత్తుపల్లిలో గణేష్ మండపాల్లో పూజలు
నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్
సత్తుపల్లి: భారీ వర్షాలు, తుపాను ప్రభావం కొనసాగుతున్నప్పటికీ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో పాటు నిమజ్జన ఊరేగింపుల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషాతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. JVR పార్క్, హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, కృషి బైపాస్ రోడ్, వేంసూర్ రోడ్ షాదిఖానా, నేతాజీ రోడ్ కాలనీతో పాటు పలు వార్డుల్లోని గణేష్ మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం భక్తులతో కలిసి గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమాల్లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు వేణు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.