BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 21 June 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యోగాంధ్ర-2026లో మంత్రి కొలుసు పార్థసారథి యోగా ఆసనాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:51 PM
118 వీక్షణలు

ఏలూరు/నూజివీడు, జూన్ 21:

12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తన స్వగృహంలో యోగా ఆసనాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రజలకు, నూజివీడు నియోజకవర్గ ప్రజలకు అంతర్జాతీయ యోగాంధ్ర-2026 శుభాకాంక్షలు తెలిపారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా ప్రాధాన్యతకు విశిష్ట స్థానం కల్పిస్తున్నారని అన్నారు. నేటి కాలంలో పిల్లలు నుండి పెద్దల వరకు ఒత్తిడులు పెరుగుతున్నాయని, వాటి నివారణకు యోగా అవసరమని సూచించారు.

యోగా ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర సాధన అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బాధ్యతను స్వయంగా తీసుకోవాలని మంత్రి పార్థసారథి అన్నారు.