BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 22 August 2026, 04:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యర్రంపల్లిలో జానకిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 04:28 PM
100 వీక్షణలు

యర్రంపల్లి, చింతలపూడి మండలం - ఆగస్టు 22:

వైఎస్సార్సీపీ మాజీ ఏఎంసీ చైర్మన్, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం యర్రంపల్లిలోని జానకిరెడ్డి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జానకిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుతూ, జానకిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందిస్తూ కుటుంబానికి అండగా నిలిచినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. :::