BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దు

తెలంగాణ
08 Jan, 2026 - 07:57 AM
86 వీక్షణలు

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దు – భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలి: డీసీపీ బి. రాంరెడ్డి

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, అంతర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల నేటి యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నదని హెచ్చరించారు. క్షణిక ఆనందాల కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు జీవితం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. ప్రస్తుత విద్యార్థులు, యువతే రేపటి సమాజ నాయకులని, వారు చేసే పనులను బట్టి భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకుంటాయని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం కృషి చేస్తే అనుకున్న స్థాయిని తప్పకుండా చేరుకుంటారని చెప్పారు. కొంతమంది వ్యక్తులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నారని, అలాంటి సంస్థల విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారన్న అపప్రచారం సమాజంలో వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. అందుకే విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు చెడు అలవాట్లు లేకపోయినా చుట్టుపక్కల వారు, బంధువులు లేదా స్నేహితులు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లయితే వారికి అవగాహన కల్పించి మార్పు తీసుకురావాలని సూచించారు. మార్పు రాకపోతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలా చేయకపోతే సమాజంలోని ప్రతి ఒక్కరిపై దాని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం, రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మారేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్, అంతర్గాన్ ఎస్సై వెంకటస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube