కనిగిరిలో వైఎస్సార్‌సీపీ హెచ్‌ఎంపాడు మండల నాయకుల సమావేశం
కనిగిరి: హెచ్‌ఎంపాడు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం సెప్టెంబర్ 20న కనిగిరిలో నిర్వహించనున్నారు. కనిగిరి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం (దద్దాల గెస్ట్‌హౌస్)లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ వైఎస్ రెడ్డి తెలిపారు.
సమావేశానికి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, పంచాయతీ కన్వీనర్లు, బూత్ కమిటీ ఏజెంట్లు, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
ప్రతి పంచాయతీకి చెందిన ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నియోజకవర్గ ఇన్‌చార్జ్ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీల వారీగా పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి పంచాయతీ నుంచి ముఖ్య నాయకులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై సమీక్షలో పాల్గొనాలని హెచ్‌ఎంపాడు మండల పార్టీ కన్వీనర్ వైఎస్ రెడ్డి కోరారు.
ఇట్లు
వైఎస్ రెడ్డి
మండల కన్వీనర్, హనుమంతపాడు