BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 August 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

11 రోజుల విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. తొలుత ఢిల్లీకి, ఆపై బ్రిటన్, అమెరికా పర్యటన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
56 వీక్షణలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.

ఢిల్లీ పర్యటన అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు బయలుదేరనున్నారు. బ్రిటన్ పర్యటన ముగిసిన తర్వాత అమెరికాకు వెళ్లనున్నారు.

ఈ విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్, అమెరికాలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా వారిని ఆహ్వానించనున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు.

మొత్తం 11 రోజుల పాటు ఈ విదేశీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం.