BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 21 June 2026, 08:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

20 ఏళ్లలో 600 సినిమాలు.. గ్లామర్ పాటలతో ఇండస్ట్రీని షేక్ చేసిన జయమాలిని.. పెళ్లి తర్వాత ఎందుకు సినిమాలకు దూరమయ్యారు?

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 08:43 PM
210 వీక్షణలు

20 ఏళ్లలో 600 సినిమాలు.. గ్లామర్ పాటలతో వెండితెరను ఊపేసిన జయమాలిని.. చివరకు ఇండస్ట్రీకి దూరం!

70, 80వ దశకాల్లో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించిన నటి జయమాలిని తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’ వంటి ఎన్నో హిట్ పాటలతో అప్పటి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత ఆమెది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో జయమాలిని ప్రత్యేక గీతం ఉంటే అది విజయానికి సంకేతంగా భావించేవారు.

1958 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించిన జయమాలిని అసలు పేరు అలమేలు మంగ. ఎనిమిది మంది సంతానంలో ఆమె చిన్నది. ప్రముఖ నటి, డాన్సర్ జ్యోతిలక్ష్మి ఆమె అక్క. చిన్నప్పటి నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న జయమాలిని, కేవలం 12 ఏళ్ల వయసులోనే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దర్శకుడు బి. విఠలాచార్య తెరకెక్కించిన ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, అప్పుడే ఆమెకు ‘జయమాలిని’ అనే పేరు స్థిరపడింది.

‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించినప్పటికీ, ప్రత్యేక గీతాల ద్వారానే ఆమె అపారమైన గుర్తింపు పొందారు. ముఖ్యంగా 1977లో విడుదలైన ‘యమగోల’ చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను..’ పాట ఆమెను స్టార్ స్థాయికి చేర్చింది. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 600కు పైగా చిత్రాల్లో నటించారు.

విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘జగన్మోహిని’, ‘గంధర్వకన్య’ వంటి చిత్రాలు జయమాలినికి నటిగా కూడా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా ‘జగన్మోహిని’ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించి, స్టార్ హీరోల చిత్రాలకు సైతం పోటీగా నిలిచింది.

కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో 1994లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్తీబన్‌ను వివాహం చేసుకున్న జయమాలిని, అనంతరం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. తెరపై గ్లామరస్‌గా కనిపించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో మితభాషి. ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో సినిమాలకు స్వస్తి పలికారు.

ప్రస్తుతం అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపిస్తున్న జయమాలిని, తన కుమార్తెకు నృత్యం నేర్పిస్తున్నప్పటికీ సినీ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచన లేదని వెల్లడించారు. రెండు దశాబ్దాల పాటు వెండితెరపై తనదైన ముద్ర వేసిన జయమాలిని, నేటికీ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని నిలబెట్టుకున్నారు.