BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 02 August 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

37 ఏళ్ల ఉపాధ్యాయ సేవలకు వీడ్కోలు.. మచ్చా శ్రీనివాస్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 06:30 PM
80 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండలంలోని చిట్టెల, గానుగపాడు, కోకిలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 37 ఏళ్ల పాటు జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందించిన మచ్చా శ్రీనివాస్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్, సతీమణి సుధారాణి దంపతులు మచ్చా శ్రీనివాస్, సతీమణి ఉషారాణిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు పునాది వేసిన ఉపాధ్యాయుడిగా మచ్చా శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

37 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధనతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చిన శ్రీనివాస్ సేవలను పలువురు ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యరదేసి రామారావు, పాపారావు తదితరులు పాల్గొని మచ్చా శ్రీనివాస్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.