BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​42 శాతం బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు ఆమోదించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 08:55 PM
56 వీక్షణలు

​42 శాతం బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు ఆమోదించాలి

  • లేకపోతే బీజేపీ, కాంగ్రెస్‌లను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తాం: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి హెచ్చరిక

​రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి 15 నెలలైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ బిల్లును సభలో ఆమోదించాలని డిమాండ్ చేసింది.

​ఈ రిజర్వేషన్ల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమితి నాయకులు విమర్శించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సరైన నిర్ణయం తీసుకుని బిల్లును ఆమోదించని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు వేముల అశోక్, శాఖపూరి భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు