BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 21 January 2026, 09:37 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం

తెలంగాణ
21 Jan, 2026 - 09:37 PM
377 వీక్షణలు
బాధితులకు ఊరట: ఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌ తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం NTODAY NEWS: హైదరాబాద్ హైదరాబాద్‌లో ‘సిటిజన్ సెంట్రిక్’ విధానం అమలు నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరం జరిగిన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ‘విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్’ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ఈ విధానం వివరించారు. పోలీసులే బాధితుల వద్దకు నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా ఆందోళనలో ఉంటారని, అటువంటి సమయంలో స్టేషన్‌కు రావడం భారంగా మారుతుందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సీఐడీ ఈ కొత్త విధానాన్ని రూపొందించిందన్నారు. ఏ కేసుల్లో స్పాట్ ఎఫ్‌ఐఆర్ -ఆత్మహత్యలు -అసహజ మరణాలు -రోడ్డు ప్రమాదాలు -చోరీలు, దోపిడీలు -వాహన దొంగతనాలు -మహిళలు, పిల్లలపై నేరాలు -ర్యాగింగ్ కేసులు ఈ కేసుల్లో పోలీసులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆసుపత్రిలో ఉన్నా కేసు నమోదు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఈ విధానం అమలులో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అనవసరంగా స్టేషన్‌కు రప్పించినా, కేసు నమోదులో జాప్యం చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఫిర్యాదు నమోదు కాకపోతే ఈ విధానం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే, బాధితులు హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 94906 16555 కు వివరాలు పంపాలని సూచించారు. సైబర్ నేర బాధితుల కోసం ప్రారంభించిన ‘సి-మిత్ర’ తరహాలోనే, ఈ విధానం కూడా ప్రజలకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హాలకు కృతజ్ఞతలు తెలిపారు. #TelanganaPolice #CitizenCentricPolicing #SpotFIR #HyderabadPolice #PoliceReforms #VictimSupport #PublicSafety #LawAndOrder #TGPolice #JusticeForAll Follow us on Website Facebook Instagram YouTube