BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 07:45 pm
Posted by : V శ్రీనివాస్

​ఆదిత్య టెక్నో స్కూల్‌లో నట్టల నివారణ మందుల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 07:45 PM
86 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఆదిత్య టెక్నో హైస్కూల్‌లో విద్యార్థులకు నట్టల పురుగుల నివారణ (డీవర్మింగ్) మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రక్తహీనత నివారణకు నట్టల నివారణ మందులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యార్థులందరికీ ఈ మందులు అందేలా చూడాలన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపతి సత్తయ్య, అంగన్‌వాడీ మరియు ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు