BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 07:45 pm
Posted by : కూనురు మధు

పరిశ్రమల కాలుష్యంతో ప్రజల విలవిల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 07:45 PM
150 వీక్షణలు

కలెక్టర్ కి వినతి పత్రం అందించిన పిట్టంపల్లి గ్రామస్తులు 

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న పిట్టంపల్లి పరిసర ప్రాంతాలలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామ పరిసరాల్లోని పలు పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ​గత కొన్ని రోజులుగా పరిశ్రమల నుంచి వస్తున్న దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం ప్రభావంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని, స్థానికుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని, తమ గ్రామానికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు అని. పిట్టంపల్లి పరిసరాల్లోని పరిశ్రమల కాలుష్యంపై త్వరితగతిన విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు అని ప్రాథమిక సమాచారం.