BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

​మంచిర్యాల జిల్లాలో ఘనంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం: కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, IAS

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 07:44 PM
42 వీక్షణలు

​మంచిర్యాల: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం పిల్లలతోనే సాధ్యమని, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగుల నిర్మూలన ఎంతో అవసరమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి, విద్యార్థినులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు గల 1,80,000 మంది పిల్లలకు ఈ మాత్రలను వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని 910 అంగన్వాడీ కేంద్రాలు, 749 ప్రభుత్వ పాఠశాలలు, 21 జూనియర్ కళాశాలలు, 180 ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసి, 650 మంది ఆశా కార్యకర్తలు, 853 మంది అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో విధులను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు మాత్రలు వేసుకోలేక మిగిలిపోయిన పిల్లల కోసం ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా 'మప్-అప్ డే' నిర్వహించి మాత్రలు అందజేస్తామని, విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

​నులిపురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, అందుకే ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తినిపించడం ద్వారా పిల్లల్లో చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుతుందని DM&HO డాక్టర్ నరేందర్ రాథోడ్ వివరించారు. ఈ మాత్రలను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోనే సిబ్బంది సమక్షంలో బాగా నమిలి చప్పరించి మింగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి ఇవ్వరాదని స్పష్టం చేశారు. వయస్సు ఆధారంగా 1-2 ఏళ్ల పిల్లలకు సగం టాబ్లెట్ పొడి చేసి, 2-19 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి టాబ్లెట్ చొప్పున శుభ్రమైన త్రాగునీటితో అందించాలని సూచించారు. మాత్ర వేసుకున్న తర్వాత శరీరంలో నులిపురుగులు ఎక్కువగా ఉన్న కొందరికి స్వల్పంగా వికారం, కడుపునొప్పి రావచ్చునని, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదని, అత్యవసర వైద్య సేవలకు సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. వైద్య, విద్యా, ఐసిడిఎస్ శాఖల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఏటీడబ్ల్యూ సురేష్, డాక్టర్ అమన్, మాస్ మీడియా బృందం సభ్యులు బుక్ వెంకటేశ్వర్లు, ఎండి రషీద్, అల్లాడి శ్రీనివాస్, డిపిహెచ్ఎన్ ఆర్.ఎస్. పద్మ, డాక్టర్ సబియా బృందంతో పాటు సిహెచ్‌ఓలు, ఉపాధ్యాయులు, వార్డెన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు