ఆధారాలు లేకుండా ఆరోపిస్తే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 1: సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వ్యక్తి స్వేచ్ఛ అంటే ఇతరులను అవమానించడం లేదా వ్యక్తిగత హననానికి పాల్పడటం కాదని పేర్కొన్నారు. కొందరు దేవుళ్లపై, మత విశ్వాసాలపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని, మత విశ్వాసాలను దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన సూచించారు.