BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 04:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 04:05 PM
211 వీక్షణలు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్, ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్. శుభశేఖర్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రౌడీ షీటర్ల ప్రస్తుత ప్రవర్తన, జీవన విధానం, వారిపై నమోదైన కేసుల స్థితిగతులను అధికారులు సమీక్షించారు. పాత కక్షలు, వివాదాలను కొనసాగిస్తూ మళ్లీ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కొత్త చట్టాల ప్రకారం కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

పాత నేరచరిత్రను విడిచిపెట్టి బాధ్యతాయుత పౌరులుగా సత్ప్రవర్తనతో జీవించాలని, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై బీట్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు.

స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని, ప్రతి ఒక్కరూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధిగా హాజరై నమోదు చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్ చర్యలు, నగర బహిష్కరణ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా సహించబోమని, రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని ప్రశాంత జీవనం సాగించాలని ఎస్‌ఐ ఎన్. శుభశేఖర్ పేర్కొన్నారు.