BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం, తాతకుంట్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
132 వీక్షణలు

రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన

విస్సన్నపేట, జూలై 15: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని నరసాపురం, తాతకుంట్ల గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు నేరుగా పొలాల్లోనే శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ చర్యలు, పంటలను తరచూ పరిశీలిస్తూ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలు, రైతు సేవా కేంద్రాల ద్వారా లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఓ బి. వాసవి సౌజన్య, ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొని రైతులకు పలు సూచనలు అందించారు. గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వ్యవసాయ నిపుణుల సలహాలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.