BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్వర్గీయ పుట్టా పోలమ్మకు మంత్రి నారా లోకేష్ ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
104 వీక్షణలు

కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి, స్వర్గీయ పుట్టా పోలమ్మ చిత్రపటానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్ యాదవ్ నివాసానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవితతో కలిసి పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పుట్టా పోలమ్మ కుటుంబ విలువలు, సేవాభావం, నిరాడంబర జీవన విధానం, మానవీయతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె జీవితం ఆదర్శప్రాయమైందని, ఆమె విలువలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, బీటెక్ రవి, లింగారెడ్డి, ఎమ్మెల్సీ రామ భూపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వర్గీయ పుట్టా పోలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.