BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 16 June 2026, 07:52 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఆగమ్మ ఇంటిని సందర్శించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Jun, 2026 - 07:52 AM
145 వీక్షణలు

ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆగమ్మ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అన్నారు.సోమవారం రోజున భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సింగన్న గూడెం గల డబుల్ బెడ్ రూమ్లు ,తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండా పురం,భువనగిరి మండలం అనంతారం గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తో కలసి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను,ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు.ఈ సందర్భంగా అయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల అమలు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.సింగన్నగూడెం లోని  డబల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలన్నారు.అనంతరం తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండా పురం, భువనగిరి మండలం అనంతారం గ్రామంలో మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరీ చేయడం జరిగిందని, వాటిలో ఎన్ని పూర్తయ్యాయని, ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని , ఇంకా ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం అందించిన సహాయంతో సొంత ఇంటి కల నేర వేరిందా అని  హోసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ లబ్ధిదారులతో ముచ్చటించారు గ్రామాలలో పూరిగుడిసే,డేరా,మట్టి గోడల,రేకుల షేడ్లలో నివసించే వారిని గుర్తించాలన్నారు. అట్టివారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరీ చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆగమ్మ ఇంటిని సందర్శించిన అధికారులు ఆమెతో మాట్లాడారు. “ఇప్పుడు మీ సొంత ఇల్లు నిర్మించుకున్నారు కదా, ఎలా అనిపిస్తోంది?” అని అడగగా, ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు. “చాలా సంతోషంగా ఉందని .ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు ఉండాలనే కల ఉండేదని .ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరింది. ఇప్పుడు భద్రంగా, గౌరవంగా మా సొంత ఇంట్లో నివసిస్తున్నాం. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని ఆమె తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అర్హులందరికీ గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అలివేలు,ఎంపీడీవోలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు