BREAKING
​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి
www.ntodaynews.com

​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 06:30 PM
59 వీక్షణలు

చెన్నూర్, కోటపల్లి ప్రాంతాల్లో జూన్ 15 వరకు కొనుగోళ్లు

​బావురావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి, కలెక్టర్ కుమార్ దీపక్

​రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు వరి ధాన్యమును కొనుగోలు చేస్తామని రాష్ట్ర శాఖ మంత్రి గడ్డం వివేకానంద స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రమును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి దిగుబడులు పెరిగినందున జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక లక్షా అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందన్నారు. పంట కోతలు ఆలస్యమైనందున చెన్నూర్, కోటపల్లి ప్రాంతాలలో జూన్ పదిహేనవ తేదీ వరకు కొనుగోళ్లు జరుపుతామని, నాణ్యమైన ధాన్యానికి సంబంధించిన నిధులను నేరుగా రైతుల ఖాతాలలోనే జమ చేస్తామని హామీ ఇచ్చారు.

​ధాన్యం సేకరణలో కూలీలు, రవాణా ఇబ్బందులు లేకుండా స్థానిక కూలీలను ఏర్పాటు చేశామని, సింగరేణి సంస్థతో మాట్లాడి ఇసుక రవాణా వాహనాలను ధాన్యం తరలింపునకు మళ్లించామని మంత్రి వివరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఆందోళనల వైపు రెచ్చగొడుతున్నారని మండిపడుతూ, పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇప్పటికే డెబ్బై శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ప్రక్రియను మరో పదిహేను రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. వచ్చే నెల ఏడవ తేదీ నుండి వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా పెద్దపల్లి, కరీంనగర్, జైపూర్ లలోని నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

​ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో దాదాపు పది వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అంతకుముందు చెన్నూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించి, వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేకానంద, కలెక్టర్ కుమార్ దీపక్, ప్రతినిధి రఘునాథ్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు