BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 12 July 2026, 05:42 pm
Posted by : V శ్రీనివాస్

మందమర్రిలో ఘనంగా కుంగ్ ఫు బెల్ట్ ఎగ్జామినేషన్స్

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jul, 2026 - 05:42 PM
174 వీక్షణలు

​మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ సింగరేణి హైస్కూల్ మైదానంలో మాస్టర్ జెట్టి కృష్ణ సారథ్యంలో కుంగ్ ఫు విద్యార్థులకు బెల్ట్ ఎగ్జామినేషన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందమర్రి పట్టణ ఏఎస్ఐ మిలన్ కుమార్ మరియు సీనియర్ మాస్టర్లు.. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎల్లో, గ్రీన్, మెరూన్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, అసిస్టెంట్ మాస్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.. బాల్యం నుంచే కుంగ్ ఫు నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఆపద సమయాల్లో ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) లభిస్తుందని, సాధారణ విద్యార్థులు నాలుగు గంటల్లో చదివే అంశాలను క్రీడాకారులు తమ ఏకాగ్రతతో ఒక్క గంటలోనే అర్థం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజేష్, శ్రీనివాస్, టి. రవి, చందు, శ్రీనివాస్, శ్రీధర్, ప్రభాకర్, ఎంఎల్ రవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు