BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 12 July 2026, 08:06 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

వాణిజ్యం,వ్యవసాయం,పారిశ్రామిక అభివృద్ధికి కృషి-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
12 Jul, 2026 - 08:06 PM
141 వీక్షణలు

ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రామన్నపేటలో ఆదివారం స్టేజ్–1, ప్యాకేజ్–2/7లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా భువనగిరి నుండి చిట్యాల వరకు రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్  ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారి కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని,రహదారి పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దశాబ్దాలుగా ఈ రహదారి విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ప్రజా ప్రభుత్వం ఆ కోరికను నెరవేరుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగుపడి, రవాణా సౌకర్యాలు విస్తరించి, ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది. అలాగే వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.మంత్రి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.