BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 18 August 2026, 10:37 pm
Posted by : MENDI SRINIVASARAO

జియ్యమ్మవలస మండలంలో పెండింగ్‌ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
18 Aug, 2026 - 10:37 PM
110 వీక్షణలు

జియ్యమ్మవలస మండలంలో పెండింగ్‌ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జియ్యమ్మవలస: కురుపాం నియోజకవర్గ పరిధిలోని జియ్యమ్మవలస మండలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జనసేన పార్టీ నాయకులు, అరకు పార్లమెంట్ కమిటీ సభ్యులు పెంట శంకర్రావు (సంజు) కోరారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి.ఆర్. కృష్ణ తేజ, IASను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జియ్యమ్మవలస మండలంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనుల వివరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన పెంట శంకర్రావు, పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. రోడ్ల పనులు పూర్తయితే ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అదేవిధంగా ఈ సమస్యను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని జియ్యమ్మవలస మండలంలోని పెండింగ్ రోడ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జియ్యమ్మవలస మండలంలోని రోడ్ల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందని పెంట శంకర్రావు (సంజు) ఆశాభావం వ్యక్తం చేశారు.

పెంట శంకర్రావు (సంజు)
కురుపాం నియోజకవర్గం – జనసేన పార్టీ