BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 25 July 2026, 01:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 01:00 PM
86 వీక్షణలు

అమరావతి, జూలై 25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.