BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 03:29 pm
Posted by : V శ్రీనివాస్

​ఆటో డ్రైవర్ల హామీలను నెరవేర్చాలి: కలెక్టర్‌కు హింద్ మజ్దూర్ సభ వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 03:29 PM
257 వీక్షణలు

రెండేళ్లయినా అమలుకు నోచుకోని ఎన్నికల వాగ్దానాలు

ఉచిత బస్సులతో దెబ్బతిన్న జీవనోపాధి: HMS జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని హింద్ మజ్దూర్ సభ మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం హింద్ మజ్దూర్ సభ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ బోర్డు ఏర్పాటు కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హింద్ మజ్దూర్ సభ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల వేళ ప్రకటించిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆటో నగర్‌ల ఏర్పాటుతో పాటు అర్హులైన డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

​ప్రస్తుతం రాష్ట్రంలో అమలువుతున్న ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలకు గిరాకీ గణనీయంగా తగ్గిపోయి ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, బ్యాంకు ఈఎంఐల భారం తోడై ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వేలాది కుటుంబాలు కేవలం ఆటో వృత్తి పైనే ఆధారపడి బతుకుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆటో కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద మరియు ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు విద్యా సహాయం, వృద్ధాప్య పింఛన్లతో పాటు తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో హింద్ మజ్దూర్ సభ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తగురం శ్రీనివాస్, హింద్ మజ్దూర్ సభ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్, సీనియర్ నాయకులు కలవాలా అంజన్న పాల్గొన్నారు. వారితో పాటు ఆటో డ్రైవర్లు పల్లపు శ్రీనివాస్, చల్లా సురేష్, అనంతుల మహేష్, రాజుగారి మహేష్, తాజ్ బాబా, సంతు, స్టాలిన్, మహేందర్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు