BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 09:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో భారీ వర్షాలు.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 09:54 AM
177 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో భారీ వర్షాలు.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా కోస్తాంధ్ర తీరప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

వర్ష సూచన ఉన్న జిల్లాలు:

విజయనగరం

పార్వతీపురం మన్యం

అల్లూరి సీతారామరాజు

కోనసీమ

తూర్పు గోదావరి

పశ్చిమ గోదావరి

ఏలూరు

కృష్ణా

అలాగే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. రైతులు, మత్స్యకారులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.