BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 01:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావుకు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 01:43 PM
163 వీక్షణలు

పెనుగొలనులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావుకు ఘన నివాళి

పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు (సామర్ల వెంకట రంగారావు) 52వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ ఎస్వీ రంగారావు తెలుగు, తమిళ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారని తెలిపారు. పాతాళ భైరవిలో మాంత్రికుడు, మాయాబజార్లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడు వంటి పౌరాణిక, జానపద పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు.

సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ నర్తనశాల చిత్రంలో కీచకుడి పాత్రకు గాను ఇండోనేషియాలో జరిగిన ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరని పేర్కొన్నారు. ఐదుసార్లు భారత రాష్ట్రపతి పురస్కారాలు, నంది అవార్డులు సహా అనేక పురస్కారాలు, సన్మానాలు అందుకుని తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ, సాయిబాబా యూత్ కమిటీ సభ్యులు ముక్కెర శ్రీకాంత్, మీనుగు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.