BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 01:44 pm
Posted by : V శ్రీనివాస్

నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% వాటా ఇవ్వాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jul, 2026 - 01:44 PM
122 వీక్షణలు

నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% వాటా ఇవ్వాలి: బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 50 శాతం అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇటీవల ఖాళీ అయిన 50 నామినేటెడ్ పదవులలో కనీసం 30 పదవులను బీసీలకే కేటాయించాలని నాయకులు కోరారు. రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు గత నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్పష్టమైన చట్టం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

​అరకొర పదవులు కల్పిస్తూ చేతులు దులుపుకోవాలని చూస్తే సహించేది లేదని, రాబోయే నియామకాల్లో బీసీలకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మచర్ల సదానందం, నాయకులు శాఖపురం భీమసేన్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, గోనె రాజు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు