BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 05:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆటోల్లో మితిమీరిన ప్రయాణికులు వద్దు.. డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
102 వీక్షణలు

కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నపాడు గ్రామంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.వి. సోమేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని తెలిపారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఓవర్‌లోడింగ్ చేయవద్దని సూచించారు.

డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.