BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 February 2026, 11:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:18 AM
296 వీక్షణలు
రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రబీ 2025-26 వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత అధికారులు సమగ్ర ముందస్తు ప్రణాళికలు రూపొందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం సేకరణలో పాల్గొనే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ విధానం అమలు చేసి ధాన్యం సేకరణను సాఫీగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమయంలో ఎత్తు, పల్లాలు సరిచూసుకుని సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు—వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు—సరిపడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి తాగునీరు, నీడ, షెడ్లు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అలాగే అన్ని PPC కేంద్రాలు ఈ నెలాఖరులోగా PCSAP పోర్టల్‌లో సంబంధిత వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. #PaddyProcurement #RabiSeason #YadadriBhuvanagiri #FarmersWelfare #AgricultureNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube