BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 24 March 2026, 02:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏ1గా కల్వకుంట్ల తారక రామారావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:17 PM
144 వీక్షణలు

ఏ1గా కల్వకుంట్ల తారక రామారావు – ఇక లొట్టపీసు కేసు కాదు!

పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కీలక అడుగు వేసింది. ఈ ఒప్పందంలో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో సుదీర్ఘమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించారన్న ఆరోపణలతో అభియోగపత్రం రూపొందించారు.

ప్రభుత్వ ధనాన్ని విదేశీ సంస్థకు అక్రమంగా బదిలీ చేయడమే ప్రధాన నేరంగా అభియోగాలు నమోదు అయ్యాయి. ఏసీబీ వివరాల ప్రకారం అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిని ఏ3గా చేర్చారు. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, అలాగే బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.

మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్లు ఆరోపించారు. ఈ నిధుల విడుదలలో నిబంధనలు పాటించలేదని, పైస్థాయి ఒత్తిళ్లతో హెచ్‌ఎండీఏ నిధులు మళ్లించబడినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. విదేశీ సంస్థలతో కుదిరిన ఒప్పందాల్లో పారదర్శకత లేకపోవడం, ప్రభుత్వ ప్రయోజనాల కంటే ప్రైవేట్ సంస్థల లాభాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.

తదుపరి న్యాయ ప్రక్రియ:

ఏసీబీ సమర్పించిన ఛార్జిషీట్‌ను కోర్టు ముందుగా సాంకేతికంగా పరిశీలిస్తుంది. సాక్ష్యాలు, చట్టపరమైన సెక్షన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసి కేసును స్వీకరిస్తుంది. ఆమోదం అనంతరం నిందితులకు సమన్లు జారీ అవుతాయి. నిందితులు కోర్టులో హాజరై తమ వాదనలు వినిపించాలి. అవసరమైతే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తే పూర్తి స్థాయి విచారణ ప్రారంభమవుతుంది.

“లొట్టపీసు కేసు కాదు!”

ఈ కేసును లొట్టపీసు కేసుగా వ్యాఖ్యానించిన కల్వకుంట్ల తారక రామారావుకు భిన్నంగా, న్యాయవర్గాలు ఇది బలమైన కేసుగా అభిప్రాయపడుతున్నాయి. ప్రజాధనం రూ.55 కోట్లు విదేశీ సంస్థ ఖాతాకు బదిలీ కావడం, సరైన ప్రక్రియ లేకపోవడం, మంత్రివర్గ ఆమోదం లేకపోవడం వంటి అంశాలు కేసుకు బలం ఇస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

మొత్తంగా, ఇది సాధారణ ఆరోపణల కేసు కాదని, పక్కా ఆధారాలతో ముందుకు వచ్చిన వ్యవహారమని భావిస్తున్నారు.