BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 25 March 2026, 09:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్ల హాట్‌స్పాట్లు – భీమిలి టాప్..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:26 PM
168 వీక్షణలు

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్ల హాట్‌స్పాట్లు – భీమిలి టాప్..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల జాబితా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యం పెరుగుతున్న నేపథ్యంలో, కొన్ని నియోజకవర్గాలు మహిళా ఓటర్ల అధిక సంఖ్యతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

ఈ జాబితాలో భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తరువాత పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295) నియోజకవర్గాలు టాప్‌లో నిలిచాయి.

అలాగే మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (ఎస్టీ) (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949) వంటి నియోజకవర్గాలు కూడా మహిళా ఓటర్ల సంఖ్యలో ముందంజలో ఉన్నాయి.

ఇక మిగిలిన ప్రముఖ నియోజకవర్గాల్లో

కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల వంటి ప్రాంతాలు కూడా లక్షకు పైగా మహిళా ఓటర్లతో కీలక స్థానాల్లో నిలిచాయి.

రెండో దశలో అనంతపురం అర్బన్, ఇచ్ఛాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ), రాజమహేంద్రవరం సిటీ, ప్రత్తిపాడు (ఎస్సీ), గుంతకల్లు, కాకినాడ సిటీ వంటి నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక మూడో దశలో మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట వంటి నియోజకవర్గాలు చోటు దక్కించుకున్నాయి.

చివరిభాగంలో శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలు ఉన్నాయి.

తాడిపత్రిలో 1,19,334 మంది మహిళా ఓటర్లు నమోదు అయ్యారు.

 మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో మహిళల ఓటు కీలకంగా మారే అవకాశముంది.